తోలేం వంశీయులచే ఐదు రోజులపాటు ఘనంగా జాతర
ముఖ్యఅతిథిగా ఆదివాసి 9 తెగల సమన్వయకర్త చుంచు రామకృష్ణ
పినపాక, మార్చి12. వై 7 న్యూస్ తెలుగు;
ఆదివాసి 9 తెగల సమన్వయకర్త చుంచు రామకృష్ణ కి మేళ తాళాలతో డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికిన దేవనగరం గ్రామం తోలెం వంశీయులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దేవనగరం గ్రామంలో పోలిశెట్టి గట్టు పై వెలసిన శ్రీ సమ్మక్క సారలమ్మ , బద్ది పోచమ్మ జాతర ఏర్పాట్లు ఘనంగా చేశారు.చుంచు రామకృష్ణ గత నాలుగు వందల సంవత్సరాలుగా నాలుగో తరం వారసులు తోలెం వంశీయులచే ఆనవాయితీగా పూజలు అందుకుంటున్న తల్లులను దర్శించుకొని పసుపు కుంకుమ, పట్టు వస్త్రాలు,గాజులు సమర్పించారు. ఈ సందర్భంగా చుంచు రామకృష్ణ మాట్లాడుతూ ఆదివాసీలు ఈ దేశ మూలవాసులని ఆదివాసీలు అంటేనే సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరని , ఆదివాసీలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, తెలంగాణ వ్యాప్తంగా జాతరల నిర్వహణ గురించి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కకు విషయం తెలియజేశామని త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కలిసి విన్నవిస్తామని జాతరలకు అయ్యే ఖర్చు ప్రభుత్వం భరించాలని అలాగే పూజారులకు వడ్డెలకు తలపతులకు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందించాలని, తరతరాలుగా వస్తున్న సంస్కృతి సంప్రదాయాలను కనుమరుగైపోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, చాలా ప్రాంతాల్లో జాతర నిర్వహణ భారం అవటం వలన అనేక చోట్ల జాతరలు కనుమరుగైపోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. తోలం వంశీయులు శ్రీనివాస్ మాట్లాడుతూ మార్చి 11 నుండి ఐదు రోజుల పాటు తోలెం వంశస్థుల ఆధ్వర్యంలో ఘనంగా జాతర జరుగుతుందని, మొదటి రోజు మంగళవారం మండమెలుగుట, బుధవారం గుట్టనుండి అమ్మవారిని గుడికి తెచ్చుట, గురువారం నిండు జాతర మరియు వనదేవతలు తల్లి దేవత గుడికి వచ్చుట, స్నానానికి వెళ్ళుట, శుక్రవారం అమ్మవార్ల మొక్కుబడులు చెల్లించుట, శనివారం తల్లి దేవతల గుడి నుండి గుట్టకు వెళ్ళుట కార్యక్రమాలు జరుగునని తెలిపారు.ఆ మహాతల్లులు అయిన దేవతలను దర్శించుకున్న వారికి కోరిన కోరికలు, సంతాన ప్రాప్తి, సర్వరోగ నివారణ మరియు గృహశాంతి, ఆయురారోగ్యాల కలిగి, తలిచిన పనులు నెరవేరునని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవరబాల తోలెం నాగయ్య ,పూజారి తోలెం సత్యమ్మ, వడ్డే మద్దెల పటేల్ (సూరిబాబు),ఆలయ కమిటి, తలపతులు ,తోలెం రాంబాబు, శ్రీను, రవీందర్, జనార్ధన్ రావు, గోవర్ధన్ రావు, ఎడిల్ల ప్రసాద్ మనీ, సరిత, వాణి, అనూష, సునీషా, కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.
,