మణుగూరు నవంబర్ 12 వై సెవెన్ న్యూస్
మండల పరిధిలోని పగిడేరు నందు డి సి ఎం ఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ప్రారంభోత్సవం చేయడం జరిగినది. ఈ సందర్భంగా పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద అమ్ముకోవాల్సిందిగా తెలియజేసినారు. రైతులకు ధాన్యం కొనుగోలు విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అని డి సి ఎం ఎస్ సంస్థ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగినది కావున రైతులందరూ కూడా ఈ యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే ధాన్యాన్ని అమ్ముకోవాల్సిందిగా తెలియజేశారు. ఈ సంవత్సరం ప్రభుత్వం వారు సన్నరకం ధాన్యానికి క్వింటాకి 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారురు రైతులు నాణ్యమైనటువంటి ధాన్యాన్ని కేంద్రాలలో అమ్ముకోవాల్సిందిగా తెలియజేశారు ఇట్టి ప్రారంభోత్సవానికి డి సి ఎం ఎస్ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు డి సి ఓ కుర్షిద్ బియ్యం సివిల్ సప్లై త్రినాథ్ బాబు వ్యవసాయ శాఖ ఏడి తాతారావు తహసిల్దార్ రాఘవరెడ్డి ఎం పి డి ఓ శ్రీనివాసరావు ఎం పి ఓ పల్నాటి వెంకటేశ్వరరావు డి సి ఎం ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంచార్జ్ లు సరెడ్డి రవి స్వరూప, దాసరి రవితేజ గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగినది.









