E-PAPER

పోరాజ్ పల్లి పిలదెల్ఫీయా ప్రార్థన మందిరంలో క్రైస్తవ ఉపవాస దీక్షలు

36వ రోజు ఉపవాస ప్రార్థన ఆరాధనలో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ జానకిరామ్

బోర్న్ విటా, ఎనర్జీ డ్రింక్స్, మ్యాగి మసాల ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేసిన డాక్టర్ జానకిరామ్

తూప్రాన్, అక్టోబర్, 27. వై సెవెన్ న్యూస్

క్రైస్తవులు 40 దినములు ఉపవాస దీక్షలు చేసి ఏసు క్రీస్తును ఆరాధించి తరిస్తున్న తీరు అద్భుతం అమోఘం అపూర్వం అనంతం అని సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ జానకిరామ్ అన్నారు. ఆదివారం ఉదయం తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని పోతరాజ్ పల్లి వద్ద ఉన్న పిలదేల్పియా చర్చ్ లోని క్రైస్తవులు 36వ ఉపవాస ప్రార్థన ఆరాధన కార్యక్రమంలో డాక్టర్ జానకిరామ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనంతరం బ్రదర్స్ కు, సిస్టర్స్ కు క్యాడ్ బరిస్ బోర్న్ విటా, మిక్స్ డ్ ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, మ్యాగి మసాల ప్యాకెట్లు శఫ్ఫార్డ్ స్వచ్ఛంధ సంస్థ అధినేత రొయ్యూరి సురేష్ గారి సహకారంతో డాక్టర్ జానకిరామ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జానకిరామ్ మాట్లాడుతూ పిలదెల్పియా ప్రార్థనా మందిరం లో దాదాపు 200 మంది క్రైస్తవ సోదర, సోదరీమణులు 40 రోజుల ఉపవాస దీక్ష చేస్తూ ఏసు నామస్మరణతో అత్యంత పరమ పవిత్రమైన కఠోర దీక్షతో ఉపవాస దీక్ష చేస్తున్న అక్కలకు, చెల్లండ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఏసు ప్రభువు పేరుతో ఉండే ఉపవాస దీక్ష తో దేవుడు అనుగ్రహం లభించడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమై దేవుని బిడ్డలుగా సేవ చేయడానికి మరింత శక్తి వస్తుందన్నారు. అనంతరం బిన్నీ ఫాస్టర్ మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్ట్ జానకిరామ్ అన్నగారికి డాక్టరేట్ పట్టా రావడం మా అందరికీ ఆనందంగా, సంతోషంగా ఉందని అన్నారు. జానకిరామ్ అన్న కుటుంభం ఆ ఏసు ప్రభువు దీవెనలతో ఆయుర్ ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఇంకా ఇంకా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో బ్రదర్ కుమార్, ప్రభాకర్, లక్ష్మణ్, ప్రవీణ్, ఏసుదాస్, విజయ్ కుమార్, సుబ్బారావు, నరేష్, హోసన్నా, ప్రదీప్, అనంతరావు, సాయి, శేఖర్, వినయ్, రమేష్, డేవిడ్, మహేష్, శ్రీశైలం, సిస్టర్స్ సుశీలమ్మ, ఇందిరమ్మ, పుణ్యవతి, మహేశ్వరి, లక్ష్మి, సమాధానం, మరియమ్మ, సుసన్న, రజిత, లక్ష్మి, కృప జ్యోతి, విజయ, శోభ, ఎలమంద తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్