మధిర ఎస్సీ కాలనీలో కెవిపిఎస్ జెండా ఆవిష్కరణ
మధిర,అక్టోబర్04 వై 7 న్యూస్
మధు (ప్రతినిధి);
గత ఎన్నికల్లో దళితులకు ఇచ్చిన హామీలన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఎస్సీ కాలనీలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక గ్రామ కార్యదర్శి సిరపంగి కిరణ్ కెవిపిఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు గడుస్తున్నప్పటికీ నేటికీ దళితులపైన కుల వివక్ష దాడులు, హత్యలు, అత్యాచారాలు కొనసాగుతున్నాయని, వీటిని అరికట్టాల్సినటువంటి ప్రభుత్వాలు, పోలీసులు సరిగా పట్టించుకోకపోవడంతో దలితులపైన దాడులు విపరీతంగా పెరుగుతున్నాయని వారు విమర్శించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కెవిపిఎస్ 1998 అక్టోబర్ 2న ఏర్పడి జస్టిస్ పున్నయ్య కమిషన్, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని సాధించిందని వారు తెలిపారు.
అనంతరం *కెవిపిఎస్ గ్రామ నూతన కమిటీని ఎన్నుకున్నారు.* *గ్రామ అధ్యక్ష,కార్యదర్శులుగా ఒట్టిపోగు సైదులు, సిరపంగి కిరణ్ లతో పాటు మరో 12మందితో గ్రామ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో వ్యకాస జిల్లా నాయకులు తేలప్రోలు రాధాకృష్ణ, పల్లెకంటి విల్సన్, కెవిపిఎస్ గ్రామ నాయకులు మంద నాని, ఎల్లంకి నాగేశ్వరావు, ఒట్టిపోగు ఏసు, గద్దల కుమారి, మంద బుజ్జి, జములమ్మ, వెంకట్, గద్దపల్లి ప్రభాకర్, యాకోబ్, రవి, గద్దల శాంతారావు, మేకల రాజా లతో గ్రామ నూతన కమిటీ ఎన్నికయ్యింది.









