E-PAPER

సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం

. పల్లెలు దేశాభివృద్ధికి పట్టుకొమ్మలు

. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం

పినపాక, సెప్టెంబర్ 03, వై 7న్యూస్ ప్రతినిధి;
దేశాభివృద్ధిలో పల్లెలకు ప్రముఖ పాత్ర పోషిస్తాయని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 60 లక్షల రూపాయలతో బొమ్మరాజుపల్లి, పెంటన్నగూడెం, భూపాలపట్నం, చింతల బయ్యారం, ఎల్చిరెడ్డిపల్లి, సీతారామపురం సిసి రోడ్లను గురువారం ప్రారంభించారు. అనంతరం ఏడూళ్ళ బయ్యారం – రాయగూడెం రెండు కోట్ల 20 లక్షల రూపాయలతో బీటి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పాయం మాట్లాడుతూ పినపాక మండలంలోని బతుకమ్మ పండుగ ముందే సీసీ రోడ్లు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. మహిళలకు బతుకమ్మ పండుగ సందర్భంగా కానుకలు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసమే ఉన్నదని తెలిపారు. ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని ఎవరికి ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని కోరారు. ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్డులో లక్ష 20 వేల రూపాయలను సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. పినపాక మండల పరిధిలో గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణ తరగతుల కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాల్గొని పలు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పినపాక మండల అధ్యక్షులు గోడిశాల రామనాథం, పినపాక మండల అధికారులు, కాంగ్రెస్ మండల నాయకులు, మహిళా కార్యకర్తలు, సర్పంచులు, ఉప సర్పంచ్ లు, ఎంపీటీసీలు, మహిళా కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!