తూప్రాన్ అక్టోబర్ 03 వై సెవెన్ న్యూస్
తూప్రాన్ మున్సిపల్ పట్టణంలోని 5వ వార్డు విద్యానగర్ కాలనీ ఆర్డీవో కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన బతుకమ్మ సంబరాలకు కాలనీ ఆడపడుచులు సాంప్రదాయ దుస్తులలో వచ్చి బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు , ఈ సందర్భంగా కాలనీ ఆడపడుచులు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా విద్య నగర్ కాలనీలో ప్రతి సంవత్సరం కాలనీ వాళ్లందరితో కలిసి ఘనంగా జరుపుకుంటామని బతుకమ్మ సంబరాలను జరపడం సంతోషకరమని అన్నారు. భారతీయ సంస్కృతిలో అనేక రకాల పండుగలు జరుపుతున్నప్పటికీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పూల ద్వారా జరుపుకునే ఏకైక గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ ఆడపడుచులు పాల్గొన్నారు.
Post Views: 164









