. ప్రజలు పోలీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
మాడుగుల పల్లి,అక్టోబర్ 03 వై 7 న్యూస్
నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలం లో సెల్ ఫోన్ పోగొట్టుకుంటే ఇక నుంచి బాధపడాల్సిన అవసరం లేదు కొనుగోలు చేసిన ఆధారాలతో పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తే పైసా ఖర్చు లేకుండా సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మీ ఫోన్స్ ను ట్రాకింగ్ చేసి అవి ఎక్కడ ఉన్నాయో గుర్తించడం జరుగుతుందని ఎస్ఐ ఎస్. కృష్ణయ్య అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆగస్టు 07 వ తేదీన మాడుగులపల్లి మండల పరిధిలోని ఇందుగుల గ్రామానికి చెందిన కిన్నెర మైసయ్య అను వ్యక్తి తన రెడ్మీ సెల్ ఫోన్ ను పోగొట్టుకున్నారు. అదే రోజు స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీస్ సిబ్బంది సీఈఐఆర్(CEIR) ద్వారా వెతికి రెడ్మీ ఫోన్ ను ట్రేస్ చేసి బాధితునికి బుధవారం అప్పగించారు. ఈసందర్బంగా ఎస్ఐ ఇంకా మాట్లాడుతూ..ఇటీవల పోలీస్ శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన సీఈఐఆర్ పోర్టల్ ద్వారా వారు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ ను గుర్తించడం జరిగిందని తెలిపారు. గుర్తించిన ఫోన్స్ ను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని వెల్లడించారు. ప్రస్తుతం సెల్ ఫోన్ లేనిది ఎటువంటి కార్యకలాపాలు ముందుకు సాగడం లేదని, ప్రధానంగా ఆండ్రాయిడ్ ఫోన్స్ వినియోగం ఎక్కువ గా పెరిగిందని అన్నారు.ఇలాంటి క్రమంలో ఫోన్స్ పోతే చాలా మంది ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఎవరివైనా ఫోన్స్ పోయినట్లు అయితే కొనుగోలు చేసిన ఆధారాలతో పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తే పైసా ఖర్చు లేకుండా మీ ఫోన్స్ ను ట్రాకింగ్ చేసి అవి ఎక్కడ ఉన్నాయో గుర్తించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు పోలీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.









