E-PAPER

నా విడాకుల వెనుక ఎలాంటి రాజకీయ కుట్ర లేదు: సమంత

హైదరాబాద్,అక్టోబర్03 వై 7 న్యూస్;

నా విడాకుల వెనుక ఎలాంటి రాజకీయ కుట్ర లేదని సమంత ఒక ప్రకటన లో తెలిపారు.తన విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందిస్తు,ఆడవాళ్లను వస్తువుల్లా చూసుకునే ఈ గ్లామర్ ఇండస్ట్రీలో పని చేయడానికి, ప్రేమలో పడడానికి, నిలబడి పోరాడడానికి చాలా శక్తి అవసరం అన్నారు. నా ప్రయాణాన్ని తక్కువ అంచనా వేయకండి. ఇక విడాకులనేవి పూర్తిగా నా వ్యక్తిగత విషయం. ఇది పరస్పర అంగీకారంతో, ఎలాంటి రాజకీయ కుట్రలు లేకుండా జరిగింది. దయచేసి నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచండి’’ అని ఓ ప్రకటనలో తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :