కాగజ్ నగర్,అక్టోబర్02 వై 7 న్యూస్;
పట్టణంలోని గాంధీ పార్కులో ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా సేవా మహాయజ్ఞాన్ని నిర్వహించారు.అందులో భాగంగా మున్సిపల్ కార్మికులతో కలిసి పార్కును శుభ్రపరిచారు. ప్రజలందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే అంటువ్యాధుల బారి నుండి కాపాడుకోగలుగుతామని తెలియజేశారు.
భాజపా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సూచన మేరకు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షులు డా.కొత్తపల్లి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ధోని శ్రీశైలం, జిల్లా కోశాధికారి అరుణ్ లోయ, సిర్పూర్ అసెంబ్లీ కన్వీనర్ గొల్లపల్లి వీరభద్ర చారి, పట్టణ అధ్యక్షులు సిందం శ్రీనివాస్, మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు వలుపదాసు శ్రీదేవి, ఈర్ల విశ్వేశ్వర్, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ తిరుపతి, అశోక్ ఆర్య, ధోతుల శ్రీనివాస్, బూరం రాజు, అశోక్, రమేష్, సంతోష్ ఠాకూర్, రాణి, అర్జున్, అనిల్, సౌరబ్ ధాత్రక్ తదితరులు పాల్గొన్నారు.









