మిర్యాలగూడ, అక్టోబర్ 02 వై 7 న్యూస్
గాంధీ విగ్రానికి డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ , చైర్మన్ , రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు, పలు స్వచ్చంధ సంస్థలు, కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం నేను నా మిర్యాలగూడల నిర్వహిస్తున్న ప్లాస్టిక్ కవర్స్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా కంపోస్టబుల్ కవర్స్ ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, నాయకులు అందరితో మిర్యాలగూడ నియోజకవర్గంలో ఈరోజు నుంచి ప్లాస్టిక్ కవర్స్ నియంత్రణ కి కృషి చేస్తామని, కంపోస్టబుల్ కవర్స్ మాత్రమే వాడుతామని ప్రమాణం చేయించడం జరిగింది.
స్వచ్చ మిర్యాలగూడ కార్యక్రమాన్ని ప్రారంభించి పట్టణంలోని రోడ్లను శుభ్రం చేసారు.
అనంతరం ఏరియా ఆసుపత్రిలో డాక్టర్స్ తో కలసి గాంధీ గారి చిత్ర పటానికి నివాళులు అర్పించి కంపోస్టబుల్ కవర్స్ ప్రారంభించారు..
అనంతరం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్త దాన శిబిరంలో పాల్గొని రక్త దాతలను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.సత్యా గ్రహమే ఆయుధంగా , అహింసా మార్గంలో పోరాడి మన దేశానికి స్వాతంతయ్రం తీసుకొచ్చిన మన జాతి పిత మహాత్మా గాంధీ గారి 155వ జయంతి సందర్భంగా* వారి ఆశీర్వాదాలతో , వారి ఆదర్శంగా ఈరోజు మన మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్లాస్టిక్ కవర్స్ నియంత్రణ ప్రారంభించడం ,స్వచ్చ మిర్యాలగూడ కార్యక్రమం నిర్వహించడం చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఉందన్నారు.నా లక్ష్యం ఒక్కటే మీరు అందరూ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ,నా ఈ పదవీకాలం పూర్తయ్యే సరికి మిర్యాలగూడ నియోజకవర్గం పారిశుద్ధ్యంలో గానీ, పర్యావరణ పరిరక్షణలో గానీ, ప్రభుత్వ విద్యా, వైద్యంలో గానీ సంవృద్ధి చెందాలి, మార్పు తీసుకొని రావాలి అని నేను బలంగా సంకల్పించాను.స్వచ్చ ధనం – పచ్చదనం కార్యక్రమం గానీ, ప్రభుత్వ విద్యా సంస్థలు, వైద్య శాలలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం గానీ, ఈరోజు ప్లాస్టిక్ కవర్స్ నియంత్రణ గానీ ఇలా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంధని అన్నారు.అలాగే ప్లాస్టిక్ కవర్స్ నియంత్రణ పూర్తిగా విజయవంతం కావాలి అంటే ప్లాస్టిక్ కవర్స్ స్థానంలో భూమిలో సులువుగా కరిగిపోయే ఎటువంటి హానీ కలిగించని కంపోస్టబుల్ కవర్స్ వాడకాన్ని పెంచాలి.అందుకుగాను మన మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్న *స్వచ్చంధ సంస్థల వారు ముందుకు వచ్చి కంపోస్టబుల్ కవర్స్ ఉచితంగా ప్రజలకు అందించి వారికి అవగాహన కల్పించాలని కోరారు.బుధవారం మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాలలో, పట్టణంలోని వార్డులలో అక్కడి నాయకులు స్వచ్చంధ సంస్థల ద్వారా స్వచ్చ మిర్యాలగూడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంధని అన్నారు.
నా లక్ష్యం నెరవేరాలని అంటే కేవలం నేను ఒక్కడిని మాత్రమే సంకల్పిస్తే సరిపోదు మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరు భాగస్వామ్యులు కావాలి. ప్రతిఒక్కరూ బాధ్యతగా భావించాలి అన్నారు.
మిర్యాలగూడ ప్రజల్లో ఐకమత్యం పెంపొందించాలి , కుల, మత, ప్రాంతీయ విబేధాలు లేకుండా మేము అంతా ఒక్కటే అనే ఉద్దేశంతో ప్రతిఒక్కరూ కలసి మెలసి నడవాలి అలాంటి వాతావరణాన్ని మిర్యాలగూడలో పెంపొందించాలి అనే లక్ష్యంతో నేను నా మిర్యాలగూడ అనే పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ, స్వచ్చంధ సంస్థలను, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వారిని, ఒక్కటి చేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
ఐకమత్యంతో కూడిన మంచి సమాజాన్ని నిర్మించేందుకు ఈరోజు నాతో ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ ,డిసిసి ప్రెసిడెంట్ శంకర్ నాయక్ ,రాష్ట్ర నాయకులు స్కైలాబ్ నాయక్,
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిళ్ల శ్రీనివాస్ ,అర్జున్ ,మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు ,పాలక సభ్యులు, స్వచ్ఛంద సంస్థ సంఘాలు, మిర్యాలగూడ డి.ఎస్.పి, సిఐలు, ఎస్ఐలు, మున్సిపల్ సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు









