E-PAPER

గాంధీజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన సబ్ కలెక్టర్ నారాయణ అమిత్

మిర్యాలగూడ,అక్టోబర్02 వై 7 న్యూస్;

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్
ఘనంగా నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ,సత్యాగ్రహమే ఆయుధంగా ఆహింస మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని అందించిన మహోన్నత వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని,
తన సత్యాగ్రహంతో భారతజాతినే కాకుండా ప్రపంచాన్ని మేల్కొల్పిన గొప్ప మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమందికి స్ఫూర్తినిస్తూ అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్, దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా లాంటి నాయకులకు స్ఫూర్తినిచ్చిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అని కొనియాడారు.ఆయన జయంతి సందర్భంగా ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో కార్యలయం సిబ్బంది పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News