. నేడు నేరగాళ్ళను పెంచి పోషిస్తున్న వారే పాలకులుగా చలామణి అవుతున్నారు .
. అక్రమాలను ప్రశ్నించినా , అందుకోసం పోరాడినా అక్రమ కేసులుతో వేధింపులు తప్పవు .
. యువతను బానిసలుగా మారుస్తున్నారు. కాదంటే హింసిస్తున్నారు .
. అఘాయిత్యానికి గురయ్యాకనో , అ దాడిలో చనిపోయాకనో మన పాలకులు స్పందిస్తున్నారు .
. మేడా శ్రీనివాస్ , ఆవేదన ,రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్..
రాజమండ్రి ఆగస్ట్ 25 వై సెవెన్ న్యూస్
ప్రతి మహిళకు 100% భద్రత కల్పిస్తాం అందుకు మాకు దమ్ము నిజాయితీ వుంది. బిడ్డల భవిష్యత్ కోసం నిజాయితీగా ఓటు హక్కు వినియోగించుకునే దైర్యం మీకు వుందా ! అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సూటిగా అడిగారు .
ఆడబిడ్డ జన్మిస్తే భారతదేశంలోనే పుట్టాలి , పెరగాలి అని ప్రపంచ దేశాలు అనుకుంటుంటే భారత్ పాలకులు మాత్రం భారతీయ మహిళకు భద్రత లేకుండా చేస్తున్నారు . పసి పిల్ల నుండి చివరకు వృద్దురాలి పై కూడా మానవ మృగాల వలే విరుచుకు పడుతు సామాజిక ఉన్మాదుల వలే బరితెగిస్తున్నారు. ఇలాంటి మానవ పశువులకు భారతదేశంలో నేటి ప్రస్తుత వ్యాపార, కార్పొరేట్ రాజకీయ పార్టిలు వెనుక నుండి అండగా నిలుస్తున్నారని , అఖండ భారతదేశంలో స్త్రీ మూర్తికి ఎంతో గౌరవ ప్రతిష్టలు
ఆనాడు నాడు వుండేవని, నేడు అందుకు భిన్నంగా రాక్షస కీచకులు , రావణాసురుడు సంతతికి చెందిన పాలకులు రాజ్య మేలుతున్నారని , మన అసెంబ్లీ , పార్లమెంట్ లో కేవలం 5% మాత్రమే పవిత్రులు , సంఘ సేవకులు వున్నారని , మన ఎన్నికల విధి , విధానాలు ప్రజాస్వామ్య బద్దంగా కాకుండా , పశుస్వామ్యంగా నిర్వహిస్తు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని , మన చట్ట సభల్లోకి జాతీయ జెండాను గౌరవించని వారికి , భారత రాజ్యాంగం పట్ల గౌరవ బావం లేని వారికి , మహిళల పై అఘాయిత్యాలకు తెగబడే వారికి , అతి పెద్ద ఆర్ధిక నేరగాళ్లకు , సంఘ విద్రోహులకు , ఎన్నికల నియమావాళికి భిన్నంగా వ్యవహరించే వ్యాపార, కార్పొరేట్, రాజకీయ పార్టి లకు పూర్తి స్థాయిలో కొమ్ము కాస్తు సామాజిక భద్రతకు తూట్లు పొడుస్తున్నారని , ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రవర్తించే రాజకీయ పార్టీలను వేదిస్తు ప్రజాస్వామ్యాన్ని ప్రమాద కర పరిస్థితులకు దారి చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
నేటి సమాజంలో నేరగాళ్లు ఎవరో పాలకులు ఎవరో తెలియటం లేదని , పాలనా ముసుగులో బాధితులకు సానుభూతి కనపరుస్తు మరో ప్రక్క నేరస్తులకు అధికారాన్ని , అనదికారాన్ని అండగా నిలపెడుతున్నారని ,
ఈ మధ్య అధికారాన్ని అనుభవిస్తు కూడా బాధితులకు న్యాయం జరగాలి అంటు పాలకులే కొత్త నాటకాలతో రక్తి కట్టిస్తున్నారని , కలకత్తాలో జరిగిన ఘోర పాశవిక హత్య కావొచ్చును , ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్రా లో జరిగిన మహిళా హత్యలు, పసి పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు కావొచ్చును అన్నింటికి ఆ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అధికార దుర్వినియోగంతో బాటుగా వారి రాజకీయ సొంత స్వార్ధ ప్రయోజనాలే ప్రధాన కారణం అని,నేటి పాలకులు కపట సానుభూతి రాజకీయాలతో నీచ రాజకీయాలకు తెర లేపుతూ సామజిక విష కాలుష్యానికి కారకులవుతున్నారని , నేటి పాలకులు ఒకరకమైన కుట్ర కోణంలో ఓటును సైతం ఓటరు ప్రమేయం లేకుండానే కైవసం చేసుకుంటున్నారని , గెలిచిన తరువాత వారి శ్రమను దోచుకుంటున్నారని , ఎన్నికల్లో ఖర్చు చేసిన సొమ్ముకు బదులుగా లక్షల కోట్లు ప్రజల నుండి వివిధ మార్గాల ద్వారా పాలనను అడ్డు పెట్టుకుంటు దోచుకుంటున్నారని , ప్రజా ఆగ్రహం పెల్లుభీక కుండా ప్రతి మనిషిలో ఒక రకమైన కుత్రిమ వైరస్ లను చొచ్చు బిచ్చి మనిషి శక్తిని కుట్ర పూరితంగా నిర్వీర్యం చేస్తున్నారని , నేడు మనుషుల్లో పట్టుమని
5 గంటలు నిరశన తెలపగలిగే శక్తి కూడా లేకుండా కలుషిత ఆహరాన్ని ప్రజల దరికి చేరుస్తున్నారని , నాణ్యమైన ఆహారాన్ని భారతీయులకు అందకుండా ఆ నాటి బ్రిటిష్ వ్యూహలను అమలు చేస్తున్నారని , మన ప్రజాస్వామ్యం నేటి కార్పొరేట్ శక్తుల కబంద హాస్థాల్లో బానిసగా బంది కాబడిందని , ఒకప్పుడు యుద్దాలు ఎదురుగా వుండేవని, నేడు మనం తీసుకునే ఆహరమే శత్రువుగా మారిందని , పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తుల చేతుల్లో దురాశతో చిక్కుకుపోయారని , నేటి పౌరులు అక్రమాలను ప్రశ్నించకుండా , ప్రజా ఉద్యమాలను నడిపించకుండా , మన కళ్ళ ముందే మన బిడ్డల జీవితాలను బూడిద చేస్తున్నారని , మన బిడ్డల జీవితాలు కళ్ల ముందే ఆవిరై పోతున్నాయని , ఆడ బిడ్డల జీవితాలు బుగ్గి పాలవుతున్నా ఎదిరించలేని , ప్రశ్నించలేని మైదాన ముసళ్ల జీవితాలుగా మన పాలకులు మనల్ని మార్చేస్తున్నారని , భయపెడుతున్నారని ఆయన తీవ్ర మనస్థాపానికి గురైయ్యారు.
తప్పులను, అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించినా , అందుకోసం పోరాడినా మన రాజకీయ నేరస్తుల బెదిరింపులుతో పాటుగా పాలకుల వేధింపులు తప్పవు అన్నట్టు పౌర హక్కులను బెదిరింపులతో కాలరాస్తున్నారు . పిర్యాదు కు స్పందన ఉండదు . న్యాయం ఖరీదైనదిగా మారిపోయింది. ప్రభుత్వ కార్యాలయాలు అవినీతి కూపంగా శాసిస్తున్నాయి. మరి భాదితులకు రక్షణ ఎక్కడ దొరుకుతుంది . న్యాయం అస్సలు దొరుకుతుందా ! అని ప్రజలు నిరాశ తోను , ఆందోళన తోను , మానసిక వేధింపుల తోను బ్రతకాల్సిన దుస్థితిలో జీవించాల్సిన ఖర్మ ప్రజలను నిత్యం వెంటాడుతుందని , స్వాతంత్య్రనికి ముందు బానిసలుగానే బ్రతికాము , స్వాతంత్య్రం అనంతరము బానిసలుగానే బ్రతుకుతున్న ఏకైక పౌరులు ప్రపంచం మొత్తంలో భారతీయులేనని , మన పాలకులు యువతను బానిసలుగా మార్చేస్తున్నారని , కాదంటే హింసిస్తున్నారని , మహిళలు అఘాయిత్యానికి గురయ్యాకనో , జరిగిన దాడిలో మరణించాకనో పాలకులు సానుభూతి రాజకీయం చేసే పాలకులనే నేడు మనం చూస్తున్నామని , నేర సంఖ్యను తగ్గించ గల నిజాయితీ పాలకులు నేడు లేకపోయారని , మహిళలకు 100% భద్రత , మంచి భవిష్యత్ కల్పించ గల దమ్ము, దైర్యం మాకు మాత్రమే వుందని, నిజాయితీగా
ఏ బలహీనతలకు తావులేని విధంగా ఓటు హక్కు వినియోగించుకునే ఆదర్శం ఓటర్లకు వుందా ! అని, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ కు ప్రజలు అధికారం అప్పగించిన నాడే సామాజిక భద్రత , మహిళలకు 100% భద్రత, మానవ హక్కులకు శాశ్వత రక్షణ , పేదరికం లేని సంపద , అంటరాని తనం లేని ఆత్మగౌరవ సమాజం అందరికి సొంతం అవుతుందని , ప్రస్తుత వ్యాపార, కార్పొరేట్ రాజకీయ పార్టీలను నమ్మినన్నాళ్ళు మన బిడ్డల భద్రత కానరాదనే నిజాన్ని మన ప్రజలు గుర్తించి
ఆ పార్టి లను భహిష్కరించాలని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తెలిపారు .
ఈ సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు ..
ఈ సమావేశంలో అర్పిసి సెక్యూలర్స్ సర్వశ్రీ డి వి రమణ మూర్తి , దూడ్డే సురేష్ , వర్ధనపు శరత్ కుమార్ , దోషి నిషాంత్ , దూడ్డే త్రినాద్ , సుంకర వెంకట భాస్కర రంగారావు , అడపా శేషగిరి , కేతా అప్పారావు , je. శ్రీయ, పిట్టల శ్రీనివాస్ తదితరులు పాల్గొనియున్నారు.









