E-PAPER

సమర్థుడైన అధికారికి సముచిత సత్కారం

బీర్కూరు,ఆగస్టు 20 (వై 7న్యూస్)

బీర్కూరు మండల కేంద్రంలో
అన్నదాతల ఆధ్వర్యంలో
ఏ శాఖలో పని చేసే అధికారి ప్రజలకు సేవకుడిగా పని చేస్తే ఆ అధికారిని ప్రతి ఒక్కరు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు .ఇది మా సమస్య అని ఓ రైతు అధికారి దృష్టి తీసుకెళ్తే వెంటనే ఆయన ఎక్కడున్నా ఆ అధికారి ఆ రైతు పొలం వద్దకు వెళ్లి సలహాలు, సూచనలు అందిస్తూ, రైతుకు అండగా నిలిచారు ఆ అధికారి ఒక్క ఏడాది కాదు రెండేళ్లు కాదు ఏకంగా 18 ఏళ్లు కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల వ్యవసాయ విస్తరణ అధికారిగా శ్రావణ్ కుమార్ అన్నదాతలకు ఎంతో అండగా నిలిచారు. అలాంటి అధికారి బదిలీపై కామారెడ్డి జిల్లా తాడువాయి వెళ్లడంతో బీర్కూర్ క్లస్టర్ పరిధిలోని అన్నదాతలు రైతు వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారి శ్రవణ్ కుమార్ ఘనంగా సన్మానించారు. సమర్థడైన అధికారికి పార్టీలకు అతీతంగా అన్నదాతలు కదిలి వచ్చి అధికారికి సన్మానం చేయడానికి పోటీ పడ్డారు. క్లస్టర్ పరిధిలోని రైతులు బదిలీపై వెళ్తున్న శ్రావణ్ కుమార్ కు రైతు వేదికలో ఘనంగా సన్మానించి మెమొంటో అందజేసి సత్కరించారు. ఏటిగడ్డ రైతు ఉత్పత్తి సంగం ఆధ్వర్యంలో వ్యవసాయ విస్తరణ అధికారి శ్రవణ్ కుమార్ కు ఘనంగా సన్మానించారు. వీరితోపాటు ఆదర్శ రైతులు, ప్రజా ప్రతనిధులు, అధికారులు 18 ఏళ్ల పాటు రైతులకు సేవలందించిన శ్రావణ్ కుమార్ బదిలీపై వెళ్లడం తమకు ఎంతో బాధ కలిగిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ అనేది సర్వసాధారణం, బదిలీపై వెళ్తున్న శ్రావణ్ కుమార్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఇంకా రైతులకు సేవలు చేయాలంటూ అన్నదాతలు కోరారు. నూతనంగా బీర్కూర్ వ్యవసాయ విస్తరణ అధికారినిగా మీనా బాధ్యతలు స్వీకరించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News