E-PAPER

మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం. శ్రీనివాసరెడ్డి, తదితర కాంగ్రెస్ నాయకులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశ ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ. జి. మధుసూదన్ రెడ్డి (GMR).

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ…స్వాతంత్ర సమరయోధులు జాతిపిత మహాత్మా గాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ , సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి మరియు ఎందరో మహనీయుల త్యాగాల వల్ల దేశానికి స్వాతంత్రం వచ్చిందని పేర్కొన్నారు. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత స్వతంత్ర సమరయోధులు పండిత్ జవహర్లాల్ గారి నేతృత్వంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని హరిత విప్లవం, క్షీర విప్లవం, భారీ ప్రాజెక్టులు నిర్మించి, IIT, IIM, ISRO లాంటి సంస్థలు, భారీ పరిశ్రమలు నెలకొల్పి దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపి, ప్రపంచంతో పోటీపడేలా ఉన్నతంగా తీర్చిదిద్దారని, అనంతరం శ్రీమతి. ఇందిరా గాంధీ గారి నేతృత్వంలో బ్యాంకుల జాతీయకరణ, రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో సాంకేతిక విప్లవం, తదనంతరం ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని వారి సేవలను కొనియాడారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News