కొత్తగూడెం,ఆగస్టు12(వై7న్యూస్);
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాండురంగాపురం నుండి మల్కాజిగిరి ఒరిస్సా రాష్ట్రం వరకు 173.63 కిలోమీటర్లు మేర కొత్త రైల్వే లైన్ సుమారు 4150 కోట్ల రూపాయల తో ఆమోదం తెలిపినందుకు బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం మాజీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో బూర్గంపహాడ్ మండలం పాండురంగాపురం రైల్వే స్టేషన్ వద్ద జిల్లా బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేసి నరేంద్ర మోడీ కి ధన్యవాదములు తెలియచేయటం జరిగింది. ఈ సందర్బంగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతాలు అయిన భద్రాచలం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా ఒరిస్సా రాయఘడ్ మల్కాజ్ గిరి జిల్లాల వరకు రైల్వే లైన్ వల్ల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చత్తీస్ ఘడ్ ,ఒరిస్సా రాష్ట్రాల గిరిజన ప్రాంతాలు పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగి ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయి అని అన్నారు. పాండురంగాపురం నుండి సారపాక వరకు రైల్వే లైన్ కోసం జిల్లా ప్రజలు అనేక రోజులుగా ఎదురు చూస్తున్నారు అని కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏకంగా సారపాక భద్రాచలం మీదగా మల్కాజిగిరి వరకు రైల్వే లైన్ శాంక్షన్ చేసి జిల్లా ప్రజల మనసు బీజేపీ ప్రభుత్వం దోచుకుంది అని అన్నారు. దీని ద్వారా కేంద్రం లో ఉన్న బీజేపీ ప్రభుత్వం తన చిత్తశుద్ధి ని భద్రాద్రి జిల్లా పట్ల తెలంగాణ రాష్ట్రం పట్ల చాటుకుంది అని అన్నారు కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల వెంకట్ రెడ్డి మాట్లాడుతు రైల్వే లైన్ ద్వారా దక్షిణ అయోధ్య గా పేరు గాంచిన భద్రాచలం కి పెద్ద ఎత్తున మూడు రాష్ట్రాల భక్తులు రాములవారి దర్శన భాగ్యం కలుగుతుంది అని భద్రాచలం మరింత అభివృద్ధి జరుగుతుంది అని అన్నారు కొత్తగూడెం అసెంబ్లీ కన్వీనర్ నరేంద్ర బాబు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున రోడ్ కనెక్టివిటీ రైల్వే కనెక్టివిటి ఎయిర్ కనెక్టివిటి వాటర్ కనెక్టివిటీ కోసం లక్షల కోట్ల నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలచెరువు శ్రీనివాసరావు భూక్యా సీతారాం నాయక్ నిడదవోలు నాగబాబు గుగులోత్ బాలునాయక్ మధుసూదన్ బూర్గంపహాడ్ మండలం అధ్యక్షులు బీరక సాయి శ్రీను పాల్వంచ రూరల్ అధ్యక్షులు పోల్లోజు క్రాంతి చారీ మణుగూరు పట్టణ అధ్యక్షులు లింగంపల్లి రమేష్ మణుగూరు రూరల్ అధ్యక్షులు కుంజా రామకృష్ణ ఓబీసీ నాయకులు గంధం నాగేంద్ర ప్రసాద్ నర్సదాసు రవి పటేల్ రహీం తదితరులు పాల్గొన్నారు.









