E-PAPER

విషజ్వరాలు ప్రబలకుండా అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలి

– సిపిఐ అశ్వాపురం మండలం కార్యదర్శి అనంతనేని సురేష్

అశ్వాపురం, ఆగస్టు 03(వై 7న్యూస్);అశ్వాపురం మండలంలో, విషజ్వరాలు ప్రబలకుండా అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని సిపిఐ అశ్వాపురం మండలం కార్యదర్శి అనంతనేని సురేష్ కోరారు, అశ్వాపురంలో శనివారం సిపిఐ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ,అశ్వాపురం మండలం లో గ్రామీణ ప్రాంతాల్లో అధిక వర్షాల వల్ల డెంగ్యూ,మలేరియా, టైఫాయిడ్, లాంటి విషజ్వరాల సంఖ్య అధికంగా ఉన్నాయని 24 గ్రామ పంచాయతీల్లో తక్షణమే హెల్త్ క్యాంపు నిర్వహించాలని కోరారు. డ్రైనేజీలు శుభ్రంగా లేకపోవడం వల్ల దోమలు విపరీతంగా పెరిగాయని, వాటిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని గ్రామీణ ప్రాంతాల్లో నుంచి వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, కమటంవెంకటేశ్వరరావు,
ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి, వేల్పుల మల్లికార్జున్,సిపిఐ అశ్వాపురం మండలం సహాయ కార్యదర్శులు, ముత్తబోయిన వెంకటేశ్వర్లు,మేలపుర సురేందర్ రెడ్డి, రాయపూడి రాజేష్, ఈనపల్లి పవన్ సాయి,అక్కెనపల్లి నాగేంద్రబాబు, ఇరుగు శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు..

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News