*అశ్వాపురం మండలం గ్రామపంచాయతీ గ్రామ సభలో పాల్గొని సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేసిన
*సిపిఐ అశ్వాపురం మండలం నాయకులు
అశ్వాపురం మండలం, సీతారాంపురం గ్రామ పంచాయతీ సెక్రెటరీ సంధ్య కి, సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేసి,, ఈ సందర్భంగా సిపిఐ అశ్వాపురం కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ,వర్షాకాలం ప్రారంభమై చెరువులు ,కాలువలు పొంగిపొర్లుతున్నాయని ,గ్రామాల్లో రోడ్ల వెంట ,ఇండ్ల వెంట ,పాములు తేళ్లు సంచరిస్తున్నాయని, గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రధానంగా, సీతారాంపురం మెయిన్ రోడ్డు దగ్గర నుంచి ఆనందపురం వెళ్లే దారిలో వీధిలైట్లు లేక రైతులు గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు,అలాగే ఖాళీ స్థలాలలో వర్షపు నీరు చేరడం,సైడ్ కాలువ లేకపోవడం వల్ల వర్షపు నీరు ఇళ్లల్లో నుంచి వచ్చే నీరు నిలిచిపోవడం చెత్త చదరం చేరి దోమల స్వైర విహారం చేస్తున్నాయి వెంటనే బ్లీచింగ్ చల్లించాలని, పారిశుద్ధ పనులు చేపట్టాలన్నారు,
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో కాలువలు శుభ్రం చేయాలని ,పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని,పెద్ద వర్షం వస్తే కాలువలు శుభ్రం లేకపోవడంతో రోడ్లపై నీరు చేరుతుందని, కాలువలు శుభ్రం చేయాలని, వర్షం వస్తే ఇబ్బందిగా మారుతున్నాయని కావున సైడ్ కాలువలు శుభ్రపరచాలని విజ్ఞప్తి చేశారు.
కొత్తనీరు చేరడం వలన బావుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, క్లోరినేషన్ చేయాలని వారు కోరారు, సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని గ్రామపంచాయతీ సెక్రెటరీ సంధ్య గారికి అందజేశారు..
ఈ కార్యక్రమంలో
ఏఐటీయూసీ మండల అధ్యక్షులు, రాయపూడి రాజేష్,
సిపిఐ అశ్వాపురం మండలం కార్యవర్గ సభ్యులు, ఈనపల్లి పవన్ సాయి, చింతల నరేష్, లక్ష్మణ్, రాము, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు









