వెంకటాపురం, జూన్ 28 (వై 7 న్యూస్ తెలుగు);
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలోని వెంకటాపురం మండలంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు 46 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి పథకం చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గించడంలో కళ్యాణలక్ష్మి పథకం కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
– రిపోర్టర్ ;
దివ్య
Post Views: 8








