E-PAPER

పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : సర్పంచ్ బానోత్ సదర్ లాల్

అశ్వాపురం, జూన్ 28 (వై 7 న్యూస్ తెలుగు)

జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలోని చవిటిగూడెం మరియు ఎస్సీ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ఆదివారం సర్పంచ్ బానోత్ సదర్ లాల్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం రెండు చుక్కల పోలియో మందు ఎంతో అవసరమని తెలిపారు.

పల్స్ పోలియో కార్యక్రమాన్ని యువత, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు బాధ్యతగా తీసుకుని ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా చూడాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉమారాణి, ఉప సర్పంచ్ తుళ్లూరి ప్రకాష్ రావు, హెచ్‌వీ శ్యామ్‌లత, వార్డు సభ్యురాలు రాగం సరిత, ఏఎన్‌ఎం భిక్షమ్మ, ఆశా వర్కర్లు సుజాత, రాణి, లలిత, అంగన్వాడీ టీచర్ వి. సరళ తదితరులు పాల్గొన్నారు.

– రిపోర్టర్ రాంబాబు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News