E-PAPER

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

దుమ్ముగూడెం, జూన్ 28

దుమ్ముగూడెం మండలం పెద్ద ఆర్లగూడెం గ్రామంలోని 115వ పోలింగ్ కేంద్రంలో ఆదివారం ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని బూత్ సిబ్బంది సమన్వయంతో నిర్వహించారు.

ఈ సందర్భంగా బీఎల్‌వో మధు స్థానిక ప్రజలు, ఓటర్లకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు వంటి అంశాలపై ప్రజలకు వివరించి దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పిలక వెంకటరమణ రెడ్డి పాల్గొని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో బూత్ సిబ్బంది, స్థానిక ప్రజలు, ఓటర్లు పాల్గొన్నారు.

– రిపోర్టర్ దివ్య

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News