E-PAPER

పర్ణశాల కాలనీలో ఇంటింటికి ఓటరు సవరణ ఫారాల పంపిణీ


దుమ్ముగూడెం మండలం, పర్ణశాల: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా బూత్ నెంబర్-96 పరిధిలోని పర్ణశాల కాలనీలో బీఎల్ఓ ముక్కెర భారతి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ఓటరు సవరణ ఫారాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ (బీఎల్‌ఏ) గోసంగి కిరణ్, బీఆర్ఎస్ రైతు సంఘం నాయకుడు జోగా వెంకటరమణ (బుజ్జి) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జోగా వెంకటరమణ మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. బీఎల్ఓలు అందజేసిన సవరణ ఫారాలను పూర్తిగా నింపి, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అతికించి తిరిగి బీఎల్ఓలకు అందజేయాలని సూచించారు.

గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఫారాలు అందజేస్తున్న సమయంలో ఇంటి వద్ద ఎవరూ లేకపోతే బీఎల్ఓలు మరో రెండు సార్లు మాత్రమే వస్తారని, ఆ తర్వాత తిరిగి ఇంటికి రారని తెలిపారు. అందువల్ల ఓటర్లు ఈ విషయాన్ని గమనించి తప్పనిసరిగా ఓటరు సవరణ ఫారాలను స్వీకరించి, పూర్తి చేసి సమర్పించాలని విజ్ఞప్తి చేశారు.

– రిపోర్టర్: దివ్య

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News