భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం, వై 7 న్యూస్
తేదీ: జూన్ 28

జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని కరకగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించారు.
పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, గ్రామ సర్పంచ్ పోలేబోయిన సుజాత పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పోలియో రహిత భారతదేశ నిర్మాణానికి ప్రతి తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ప్రతి చిన్నారి ఆరోగ్యమే దేశ భవిష్యత్తు అని, జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో స్థానిక పీహెచ్‌సీ వైద్యులు, సంబంధిత అధికారులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
– రిపోర్టర్ దిలీప్








