శ్రీకాకుళం జిల్లా, పలాస, వై 7 న్యూస్
తేదీ: జూన్ 28
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి మరో ప్రాణాన్ని బలితీసుకుంది. పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన బైనపల్లి అదమ్మ కిడ్నీ వ్యాధితో కొంతకాలంగా బాధపడుతూ చికిత్స పొందుతుండగా శనివారం మృతి చెందారు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, అదమ్మ గత కొంతకాలంగా పలాస కిడ్నీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం ఆమె కన్నుమూశారు.
ఉద్దానం ప్రాంతంలోని అనేక గ్రామాల్లో ఇప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రజలు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో రోగులు చికిత్స పొందుతూ జీవన పోరాటం సాగిస్తున్నారని చెబుతున్నారు.
కిడ్నీ వ్యాధి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం, సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఉద్దానం ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు, తాగునీటి వసతులు కల్పించి కిడ్నీ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
– సీనియర్ రిపోర్టర్ దినేష్








