E-PAPER

రైతుల ముఖాల్లో ఆనందం చూస్తున్నాం:మిరియాల విక్రమ్ రెడ్డి

రైతు రుణమాఫీ పట్ల తెలంగాణ సర్కార్ కు కృతజ్ఞతలు

మండల కాంగ్రెస్ నాయకులు మిరియాల విక్రమ్ రెడ్డి

తిరుమలాయపాలెం జూలై 30;అనుకున్న సమయం కంటే ముందుగానే రైతులకు రుణమాఫీ చేయడంతో రైతుల ముఖాల్లో ఆనందాన్ని చూస్తున్నామని తిరుమలాయపాలెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల విక్రమ్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ ప్రభుత్వం రెండవ విడత రైతులకు రూ.1.50ల లోపు రుణమాఫీ చేయగా, నేరుగా రైతుల ఖాతాలోకి నిధులు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతు సంక్షేమ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మరోసారి నిరూపించిడం జరిగిందన్నారు.రైతు రుణమాఫీ అమలు చేసి రైతుల పక్ష ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని సాటి చెప్పారని అన్నారు. రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. రైతు రుణమాఫీ ఓ చరిత్ర అని, ఆ పథకం అమలు చేసే ధైర్యం ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని అన్నారు. ఒక వైపు ప్రకృతి వర్షాల రూపంలో రైతులకు ఆనందాన్ని ఇస్తుంటే మరో వైపు తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ తో రైతులు మరింత సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఇలాంటి ప్రభుత్వం వంటకాలల పాటు చల్లగా ఉండాలని రైతులు కోరుకుంటున్నారని తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News