మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీనియర్ నాయకులు గుంతేటి వీరభద్రం
తిరుమలాయపాలెం జూలై 30;
ఖమ్మం జిల్లా మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీనియర్ నాయకులు గుంతేటి వీరభద్రం మాట్లాడుతూ ఖమ్మంజిల్లా నుండి మాల మహనాడు ఆధ్వర్యంలో ఎస్సీ ఏబీసీడీల వర్గీకరణను వ్యతిరేకిస్తూ చలో ఢిల్లీ కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా మాలలు వేల సంఖ్యలో కదులుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాలల సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని గుంతేటి వీరభద్రం అన్నారు మాలలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలలో తీవ్ర నష్టం జరుగుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన దళిత బంధు కార్యక్రమంలో గాని దళితులకు మూడెకరాల భూమి స్కీం లో గాని ఎస్సీ కార్పొరేషన్ లోన్ విషయంలో గాని తీవ్ర నష్టం జరిగిందని అన్నారు ఈ ప్రభుత్వంలోనైన మాలలకు తగు న్యాయం జరిగే విధంగా మాలలు మేలుకోవాలని గుంతేటి వీరభద్రం పిలుపునిచ్చారు
ఉమ్మడి తెలుగు రాస్టాలలో ఉండబడినటువంటి ప్రభుత్వాలు రాష్ట్రస్థాయిలో ఏబిసిడిల వర్గీకరణ చేస్తామని మాదిగ సామాజిక వర్గాన్ని తప్పు దోవ పట్టిస్తూ మోసం చేస్తున్నారని వీరభద్రం అన్నారు ఎస్సీ కులాలలో ఉండబడినటువంటి ఐక్యతను దెబ్బతీస్తున్నారు తప్ప ప్రభుత్వం ద్వారా అందాల్సినటువంటి నిధులను పక్కదారి పట్టిస్తున్నారు అని అన్నారు భారత రాజ్యాంగం రాయబడిన కాలం నాటికి షెడ్యూల్డ్ కులాల జనాభా ఆ నాటికి చాలా తక్కువ కాని నేటికీ 2024 సంవత్సరానికి ఎస్సీ కులాల జనాభా అధిక సంఖ్యలో పెరిగింది విద్యా రంగాలలో పై చదువులు చదివి నిరుద్యోగులుగా లక్షల సంఖ్యలో ఉన్నారు షెడ్యూల్ కులాల వారికి కావాల్సింది రిజర్వేషన్ శాతాన్ని పెంచాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని గుంతేటి వీరభద్రం పేర్కొన్నారు
ఈ హక్కుల కోసం షెడ్యూల్ కులాల వారు ప్రభుత్వ వ్యవస్థ పైన ఎక్కడ ఉద్యమాలు చేస్తారోనని అధికారంలో ఉండబడినటువంటి ఆధిపత్య కుల నాయకులు విభజించి పాలించే విధానాన్ని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయాలను మా తోటి సహచరులు మిత్రులైన మాదిగ సోదరులు పాలకవర్గాల మోసాలను గమనించి ఐక్య ఉద్యమాల కోసం ముందుకు రావాలని కోరినారు
ఈ కార్యక్రమంలో మాల మహానాడు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి కనకరాజు ఖమ్మం నగర వర్కింగ్ ప్రెసిడెంట్ పేరం మల్లయ్య మెట్టు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు









