అశ్వాపురం: అశ్వాపురం మండల కేంద్రంలోని చింతల బజార్ లో శనివారం సాయంత్రం గాలులతో కూడిన వర్షం వల్ల ఓ నివాస గృహం పక్కన ఉన్న చింతచెట్టు విరిగి నివాస గృహాలపై పడటంతో ఆ ఇంట్లో ఉన్నవారు తృటీలో ప్రమాదం నుంచి తప్పించుకొని బయటపడ్డారు. మండల కేంద్రంలోని చింతల బజార్ లోని రేపాకుల నాగమ్మ రేకుల ఇల్లు, గోకులపల్లి వెంకన్న నివాస గృహాలపై చింత చెట్టు విరిగి గృహాలపై పడింది. చెట్టు పడే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం నుండి బయటపడ్డారు. అయితే రేకులు పై చింతచెట్టు పడటంతో ఇల్లు దెబ్బతిన్నదని అధికారులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
Post Views: 425