E-PAPER

వావిలాల రమాదేవి మృతిపై విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలి

ములుగు జిల్లాలో బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు వావిలాల జనార్దన్ మాట్లాడుతూ వావిలాల రమాదేవి హన్మకొండలోని ఇస్లామియా కళాశాల లో ఇంటర్ మొదటి సంత్సరం చదువుతున్న మైనర్ అమ్మాయిని గుర్రెవుల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కొంచర్ల ముత్తయ్య కుమారుడు కొంచర్ల ప్రశాంత్ వయసు 25 సంత్సరాలుగల ప్రశాంత్ మైనర్ అమ్మాయినీ పెండ్లి చేసుకుంటాను అని నమ్మించి కళాశాల నుండి 2023 పీబ్రవరి 9 తారీకు రోజున గుర్రెవుల గ్రామానికి చెందిన ప్రశాంత్ మైనర్ అమ్మాయి రమాదేవిని ప్రేమ పేరుతో లోబర్చుకొని కొంచర్ల ముత్తయ్య కుమారుడు గుర్రెవుల తీసుకొచ్చి 4 రోజులుకాపురం చేసిన తర్వాత మా తల్లి తండ్రులు కట్నం లేకుంటే నిన్ను వద్దు అంటూ ప్రశాంత్ కుటుంబ సభ్యులు చిత్ర హింసలు పెట్టుకుంటూ రమాదేవి అమ్మ నాన్న లు లేని సమయం లో స్వంత గ్రామమైన తుపాకులగూడెం ఇంటికి తీసుకొచ్చి ఉరిపెట్టారని దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు వావిలాల జనార్దన్ అన్నారు. వావిలాల రమాదేవి మృతి పై అమ్మ నాన్న లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినపట్టించు కోకపోవడంతోనే జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చెయ్యడం జరిగింది అని అన్నారు. ఇప్పటికైనా మాజీ సర్పంచ్ కొంచర్ల ముత్తయ్య ఫ్యామిలీ పైనా వరకట్నం వేధింపుల కింద కుటుంబసభ్యుల పై కేసు నమోదు చేసి అరెస్ట్ చెయ్యాలని వావిలాల జనార్దన్ అన్నారు. ఈ సమావేశం లో అమ్మాయి అన్న వావిలాల సారయ్య బీజేపీ కిసాన్ మోర్చా ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి డాక్టర్ జాడి రామరాజు నేత బీజేపీ మహిళ మోర్చా మండల అధ్యక్షురాలు పలుక గంగ వాసం పల్లి సతీష్ యం ఆర్ పి ఎస్ అధ్యక్షులు కన్నాయిగూడెం చిలివేరు రమేష్ కర్నె గణష్ రాధిక వినోద తదితరులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News