E-PAPER

శాంసంగ్ గెలాక్సీ M47 5G: సరికొత్త మిడ్-రేంజ్ మాన్‌స్టర్ వస్తోంది.. ఫీచర్లు, ధర వివరాలు!

భారత మార్కెట్లో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో పట్టు సాధించేందుకు ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) మరో కొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. గెలాక్సీ M-సిరీస్ లైనప్‌లో భాగంగా ‘నెక్స్ట్ లెవెల్ మాన్‌స్టర్’ ట్యాగ్‌లైన్‌తో సరికొత్త ‘శాంసంగ్ గెలాక్సీ M47 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు కంపెనీ కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ ‘SM-M476B/DS’ మోడల్ నంబర్‌తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌తో పాటు గీక్‌బెంచ్‌లో కూడా కనిపించడంతో, అతి త్వరలోనే ఇది భారత మార్కెట్లోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

లీక్ అయిన ఫీచర్లు మరియు అంచనాల ప్రకారం.. ఈ సరికొత్త శాంసంగ్ ఫోన్ శక్తివంతమైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 (Qualcomm Snapdragon 6 Gen 3) ప్రాసెసర్‌తో రన్ కానుంది. మల్టీటాస్కింగ్ మరియు గేమింగ్ కోసం ఇందులో 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అందించే అవకాశం ఉంది. అంతేకాకుండా, మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించుకునే వీలుంటుంది. సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే.. ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8 (One UI 8) ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

డిజైన్ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ మునుపటి మోడళ్లకు భిన్నంగా రౌండెడ్ కార్నర్ మోడ్రన్ బాక్సీ ఫ్రేమ్‌తో రానుంది. బ్యాక్ ప్యానెల్ డార్క్ మ్యాట్ ఫినిషింగ్‌తో పాటు డీప్ క్రిమ్సన్ లేదా మెరూన్ కలర్ వేరియంట్‌లో ఆకట్టుకునేలా ఉండనుంది. సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. ధర విషయానికి వస్తే, శాంసంగ్ గెలాక్సీ M47 5జీ ఫోన్ భారత మార్కెట్లో రూ. 25,000 లోపు బడ్జెట్ ధరలోనే అందుబాటులోకి రానుందని మార్కెట్ నిపుణుల అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్ అధికారిక లాంచ్ తర్వాత ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ (Amazon) తో పాటు శాంసంగ్ ఇండియా అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో విక్రయానికి రానుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News