E-PAPER

ఇంటింటికి ఫీవర్ సర్వే ;టీబీ నోడల్ పర్సన్ జయప్రకాష్

జోగులాంబ గద్వాల జిల్లా జూలై 27;

రాజోలి మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాలలో రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుబాబు సారథ్యం లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే లు చేస్తున్నామని రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టిబి నోడల్ పర్సన్ జయప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ , టైఫాయిడ్ తదితర వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ఏ ఎన్ ఎం లు, ఆశా కార్యకర్తలు వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఫీవర్ సర్వే లు చేస్తూ లక్షణాలు ఉన్న అనుమానితుల ను గుర్తించి వారికి రక్త పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నామని ఆయన అన్నారు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి రోగులకు వైద్య సౌకర్యం అందిస్తున్నాం అని రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టిబి నోడల్ పర్సన్ జయప్రకాష్ తెలియజేశారు. ఈ కార్యక్రమం లో హెల్త్ అసిస్టెంట్ రంజిత్ కుమార్, ఏ ఎన్ ఎం లు ఆశా కార్యకర్తలు వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్