E-PAPER

అడుగడుగున రోడ్డు గుంతలమయం

Y7 న్యూస్ తెలుగు,నిర్మల్ ;

ఉట్నూర్ ఎక్స్ రోడ్ నుండి ఆషీబాబాద్ వరకు రోడ్లు మోకాలి లోతు గుంటలతో ప్రమాద కరంగా మారింది. ఈ రోడ్డుపై ప్రయాణమంటేనే వాహనదారులకు నరకాన్ని చూ పిస్తోంది. ప్రతిరోజూ ఉట్నూరు ఎక్స్ రోడ్ నుండి అసిఫాబాద్ మీదుగా వందలాదిమంది వాహనదారులు వెళుతుంటారు. రోడ్డుపై గుంతలు తప్పించబోయి చాలామంది ప్రమాదం బారినపడుతున్నారు. మరికొందరు ప్రాణాలు సైతం పొగొట్టుకున్నారు. 3 కి లోమీటర్లు ప్రయాణం పూర్తి కావాలంటే 30 ని మిషాలు పడుతుందంటే రోడ్డు ఏదుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయినా అధికారుల్లో చలనం లేదు. మీ చావు మీరు చావండి అన్నట్లు వ్యవహరిస్తూ రోడ్డు మరమ్మ తులను పట్టించుకొనేవారే కరువయ్యారు. ఈ రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వారి ప్రయాణం కొనసాగిస్తున్నారు. ప్రజలు రోడ్డు దుస్థితిని తలచుకుంటూ అధికారులు, ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News