ఖమ్మం – చింతకాని మండలం మత్కేపల్లి గ్రామానికి చెందిన కటికాల రామకృష్ణ కూతురు అంజలి కార్తీక(9) తడి చేతులతో సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్ కు గురయింది.
దీంతో కుప్పకూలిపోయిన కార్తీకను వైద్యుల వద్దకు తీసుకుపోగా, అప్పటికే బాలిక మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 1,018









