Y7 న్యూస్ తెలుగు,తాండూర్;
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండల పరిధిలోని రేచిని రైల్వేస్టేషన్ రోడ్ నందు గల సేవాజ్యోతి శరణాలయం లో ఏపీజే అబ్ధుల్ కలాం వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం శ్రీ స్వశక్తి భారత్ సేవాట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి మల్లేశం గజ్జెల్లి సగరలు మాట్లాడుతూ ప్రతిరోజూ ఇంటిలో బడిలో కూడా మన పిల్లలకు ఇలాంటి మహనీయుల గురించి తెలియజెప్పాలి, భారతీయతే నా ఆత్మ అని అన్న అబ్ధుల్ కలాం బాటలో మనందరం నడవాలని, అభాగ్యులకు నిర్భాగ్యులకు తోడుండాలని కోరుతూ విద్యార్థులకు నేటి సమాజానికి పిలుపు నిచ్చారు, ఈ కార్యక్రమంలో సేవాజ్యోతి శరణాలయం నిర్వాహకులు, మానసిక మతిస్థిమితం లేని మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 103









