Y7న్యూస్ తెలుగు,కుంటాల;
తెలంగాణలోని నిర్మల్ జిల్లా కుంటాల మండలం లింబా కె గ్రామం లో ఉరి మధ్యలో మెయిన్ రోడ్డు చాలా దారుణం గా మారింది నడవడానికి వీలు లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు గ్రామస్తులు మాట్లాడుతూ ఇది ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది దీనిని నాయకులు,అధికారులు స్పందించాలి అని కోరుకుంటున్నారు లింబా కె ప్రజల గ్రామ వాసులు అధ్వాన్నమైన రహదారి, భారీ గుంతలతో విసిగిపోయి తమ అసంతృప్తిని విభిన్నంగా వెళ్లగక్కారు. ఇదే విషయమై నిరసన వ్యక్తం చేశారు. నీరు నిలిచిన రోడ్డు గుంతల వద్దకు ప్రజలు వచ్చి వరి నాట్లు వేశారు.స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల పనితీరుని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళడానికి తమ సమస్య పదిమందిని ఆకర్షించేలా చేయడానికి ప్రజలు భిన్నమైన పద్దతిని ఎంచుకున్నారు. వరి నాట్లు గుంతలలో వేశారు. నీటమునిగిన రోడ్లు, శిథిలావస్థకు చేరడంతో రోజువారీ ప్రయాణం కష్టతరంగా మారిందనీ ప్రభుత్వం దీనిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరసన చేపట్టారు









