మణుగూరు, అక్టోబర్ 9 (Y7 న్యూస్ తెలుగు):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణ పరిధిలోని 33/11 కేవీ మణుగూరు సబ్స్టేషన్ పరిధిలో అత్యవసర విద్యుత్ పనుల కారణంగా శనివారం (అక్టోబర్ 10) ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.
ఈ మేరకు 11 కేవీ మణుగూరు ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. అయితే, గుట్టమల్లారం 33/11 కేవీ సబ్స్టేషన్ పరిధిలో ఎలాంటి విద్యుత్ అంతరాయం ఉండదని స్పష్టం చేశారు.
విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, విద్యుత్ శాఖకు సహకరించాలని అధికారులు కోరారు.
Post Views: 18









