E-PAPER

కొబ్బరి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా? ఈ సింపుల్ టిప్స్ పాటించండి!

దక్షిణ భారత వంటకాల్లో, ముఖ్యంగా కర్ణాటక వంటల్లో కొబ్బరికి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం అల్పాహారానికి చేసే చట్నీల నుంచి మధ్యాహ్నం సాంబార్, కూరలు, తీపి వంటకాల వరకు కొబ్బరిని విరివిగా ఉపయోగిస్తారు. అయితే కొబ్బరికాయ పగలగొట్టిన తర్వాత ఒకేసారి మొత్తం ఉపయోగించడం సాధ్యం కాదు. సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే కొబ్బరి త్వరగా ఎండిపోవడం, వాసన రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

కొబ్బరికాయ పగలగొట్టిన తర్వాత మిగిలిన భాగాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెట్టకుండా, ముందుగా చిప్ప నుంచి తెల్లటి కొబ్బరిని వేరు చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని తడి లేని శుభ్రమైన ఎయిర్‌టైట్ డబ్బాలో వేసి మూత గట్టిగా పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి. ఇలా చేయడం వల్ల కొబ్బరిలోని తేమ, తాజాదనం ఎక్కువకాలం నిలిచి ఉంటాయి.

ఇక తురిమిన కొబ్బరిని కూడా ఎయిర్‌టైట్ డబ్బాలో నిల్వ చేయాలి. అయితే దాన్ని 3 నుంచి 4 రోజుల్లోపు ఉపయోగించడం మంచిది. ఫ్రిజ్ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వేడి వాతావరణంలో కొబ్బరిని ఎక్కువసేపు బయట ఉంచకూడదు. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే కొబ్బరి రుచి, నాణ్యతను కాపాడుకోవచ్చు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!