ఆఫీసులో తిరిగి అడుగుపెట్టిన సందర్భంగా ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ఉద్యోగులతో సరదాగా మాట్లాడారు. ‘ఈ రోజు నా ఉద్యోగంలో మొదటి రోజు. నా దగ్గర కంప్యూటర్ కూడా లేదు. ఐటీ విభాగం నాకు కొత్త పీసీ ఇవ్వబోతోంది. అది ఎన్విడియా ఆర్టీఎక్స్ స్పార్క్ (RTX Spark) అయి ఉంటుందని ఆశిస్తున్నాను’ అంటూ చమత్కరించారు. దీంతో ఉద్యోగులంతా నవ్వుల్లో మునిగిపోయారు.
అయితే, కాసేపటికే ఆయన తన గొంతు మార్చి ఉద్యోగులతో భావోద్వేగంగా మాట్లాడారు. ‘మిమ్మల్ని ఇన్ని ఇబ్బందులకు గురిచేసినందుకు నిజంగా క్షమించండి. వాటిని సరిదిద్దుకుని తిరిగి ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తాను’ అంటూ క్షమాపణలు చెప్పారు.
హువాంగ్ మాటలతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా భావోద్వేగంగా మారింది. ఆయన మాటలకు స్పందించిన ఉద్యోగులు మరోసారి చప్పట్లు కొడుతూ తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా తీసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Post Views: 3








