ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హువావే (Huawei) తన కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Mate X8ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. బుక్ స్టైల్ డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్ ఆకట్టుకునే డిస్ప్లే ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 8.2 అంగుళాల ఇన్నర్ డిస్ప్లే, 6.54 అంగుళాల కవర్ స్క్రీన్‌ను అందించారు. అలాగే Kirin 9050 Pro Logic Folding Tau చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఐదు కలర్ ఆప్షన్లు, పలు స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ లభించనుంది.
ఈ ఫోన్లోని 8.2 అంగుళాల OLED ఇన్నర్ డిస్ప్లే 2424×2340 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది 1-120Hz LTPO రిఫ్రెష్ రేట్, 1440Hz PWM డిమ్మింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. గరిష్ఠంగా 8,000 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్నెస్ను అందిస్తుంది. ఇక 6.54 అంగుళాల కవర్ డిస్ప్లేలో డ్యూయల్ లేయర్ OLED ప్యానెల్, 2444×1132 పిక్సెల్స్ రిజల్యూషన్ ఉన్నాయి. ఈ స్క్రీన్ 1-120Hz LTPO, HDR Vivid, 1.07 బిలియన్ కలర్స్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని గరిష్ఠ బ్రైట్నెస్ 12,000 నిట్స్‌గా ఉంది.
డిజైన్ పరంగా కూడా Huawei Mate X8 ప్రత్యేకతను చాటుకుంటోంది. ఫోన్‌ను పూర్తిగా తెరిచినప్పుడు దీని మందం కేవలం 4.2 మిల్లీమీటర్లుగా ఉంటుంది. పెద్ద స్క్రీన్, అధిక రిఫ్రెష్ రేట్, ఆకట్టుకునే బ్రైట్నెస్ వంటి ఫీచర్లతో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో హువావే కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది.
Post Views: 4








