E-PAPER

ఒక్క రూపాయి రీఫండ్ కోసం న్యాయపోరాటం.. మహిళకు రూ.7,500 పరిహారం!

ఆన్‌లైన్ షాపింగ్‌లో రీఫండ్ మొత్తం చిన్నదే కదా అని చాలామంది పట్టించుకోరు. కానీ హర్యానాలోని పంచకులకు చెందిన ఓ మహిళ తనకు రావాల్సిన ఒక్క రూపాయి కోసం న్యాయపోరాటం చేసింది. ఓ ఆన్‌లైన్ కిరాణా సంస్థ ఆమెకు తిరిగి చెల్లించాల్సిన మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేయకుండా డిజిటల్ వాలెట్‌లో క్రెడిట్ చేసింది.

దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మహిళ, తన సమ్మతి లేకుండా డబ్బును వాలెట్‌లో జమ చేయడాన్ని ప్రశ్నిస్తూ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. రీఫండ్ మొత్తాన్ని వినియోగదారుడు కోరుకున్న విధంగా తిరిగి చెల్లించాల్సిన బాధ్యత కంపెనీలపై ఉందని ఆమె తన వాదనను వినిపించింది.

ఈ కేసును విచారించిన వినియోగదారుల కమిషన్, కంపెనీ చర్యను సేవా లోపంగా పరిగణించింది. దీంతో బాధిత మహిళకు మొత్తం రూ.7,500 పరిహారం చెల్లించాలని సంస్థను ఆదేశించింది. రీఫండ్ నిబంధనల్లో పారదర్శకత, వినియోగదారుల సమ్మతి ఎంత ముఖ్యమో ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!