సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి రకరకాల ఊహాగానాలు, గాసిప్స్ రావడం సాధారణమే. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి విషయంలోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. యంగ్ హీరో శర్వానంద్ నటించిన యాక్షన్ మూవీ ‘భోగి’ ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో డింపుల్ హయాతి పాల్గొని సందడి చేసింది. ఈ వేడుకలో ఆమె శర్వానంద్‌తో సరదాగా మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను ఓ మీమ్ పేజీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేశారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘శర్వానంద్లాగే డింపుల్ హయాతికి కూడా పెళ్లయిపోయింది కదా’ అంటూ కామెంట్ చేశాడు. దీనిపై డింపుల్ ఏమాత్రం సీరియస్ అవ్వకుండా తనదైన శైలిలో ఫన్నీగా స్పందించింది. తనకు ఇంకా పెళ్లి కాలేదంటూ రిప్లై ఇచ్చి అందరినీ నవ్వించింది.
స్టేజ్‌పై ఇద్దరు హీరోహీరోయిన్లు సరదాగా మాట్లాడుకున్న వీడియోకు నెటిజన్లు పెళ్లి వార్తలను జోడించడంపై డింపుల్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది. దీంతో ‘భోగి’ సినిమాకు కూడా సోషల్ మీడియాలో మరింత ప్రచారం లభిస్తోంది. నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Post Views: 3








