E-PAPER

నేపాల్‌లో భారీ భూకంపం.. భారత్‌లోని పలు రాష్ట్రాల్లో కంపించిన భూమి!

నేపాల్‌లో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. తూర్పు నేపాల్‌లోని కోశి ప్రావిన్స్‌లో రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ భూకంప ప్రభావం భారత్‌లోని సరిహద్దు ప్రాంతాలపైనా పడింది. సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ (EMSC) ప్రకారం భూకంప కేంద్రం భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉంది.

నేపాల్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:17 గంటలకు ఈ ప్రకంపనలు సంభవించాయి. తూర్పు నేపాల్‌లోని తప్లేజంగ్ జిల్లాలో, సిక్కిం సరిహద్దుకు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సిక్కింలోని గేజింగ్ ప్రాంతానికి సుమారు 68 కిలోమీటర్ల వాయువ్య దిశలో భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.

తూర్పు నేపాల్‌లోని పర్వత, మైదాన ప్రాంతాలతో పాటు భారత్‌లోని సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ ప్రకంపనలు కనిపించాయి. బీహార్, మేఘాలయ, ఉత్తర బెంగాల్‌లో కూడా భూమి కంపించినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!