E-PAPER

9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో HONOR 700 సిరీస్ లాంచ్.. ఫోన్ వెనుక ప్రత్యేక డైనమిక్ డిస్‌ప్లే!

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో హానర్ (HONOR) కొత్త 700 సిరీస్‌ను చైనాలో విడుదల చేసింది. ఇందులో HONOR 700S, HONOR 700, HONOR 700 Pro పేర్లతో మూడు మోడళ్లను పరిచయం చేసింది. ఈ సిరీస్‌లో 9000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, 120Hz OLED డిస్‌ప్లే వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఫోన్ వెనుక భాగంలో 1.59 అంగుళాల ప్రత్యేక డైనమిక్ డిస్‌ప్లేను అందించడం విశేషం.

ఈ సిరీస్‌లో బేస్ మోడల్ అయిన HONOR 700Sలో 6.57 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ HBM బ్రైట్‌నెస్‌తో పనిచేస్తుంది. వెనుకవైపు 1.59 అంగుళాల AMOLED డైనమిక్ డిస్‌ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో 12GB RAM, 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి.

కెమెరాల విషయానికి వస్తే.. OIS సపోర్ట్‌తో కూడిన 200MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 50MP కెమెరా ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 9000mAh సామర్థ్యంతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కల్పించారు. అంతేకాకుండా IP68, IP69, IP69K రేటింగ్స్‌తో నీరు, ధూళి నుంచి రక్షణ కల్పించారు. మిగిలిన రెండు మోడళ్ల ఫీచర్లు, ధరలపై కూడా స్మార్ట్‌ఫోన్ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!