E-PAPER

చలికాలంలో డ్రై స్కిన్‌కు చెక్ పెట్టే ఇంటి చిట్కా.. మీగడతోనే నేచురల్ కోల్డ్ క్రీమ్ తయారీ!

చలికాలం ప్రారంభమవడంతో చర్మ సంబంధిత సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. చల్లని, పొడి గాలుల కారణంగా చర్మంలోని తేమ తగ్గిపోయి ముఖం నిర్జీవంగా మారుతుంది. చర్మం పొడిబారడం, తెల్లటి పొట్టు రాలడం, పెదాలు, బుగ్గల చుట్టూ పగుళ్లు రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఈ సీజన్‌లో చర్మాన్ని తేమగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. మార్కెట్లో లభించే క్రీములకు బదులుగా ఇంట్లోనే మీగడతో మాయిశ్చరైజింగ్ క్రీమ్ తయారు చేసుకోవచ్చని చర్మ సంరక్షణ నిపుణులు సూచిస్తున్నారు.

ఈ క్రీమ్ తయారీకి ఒక కప్పు తాజా మీగడ, ఒక పెద్ద చెంచా బాదం నూనె, ఒక చిన్న చెంచా తేనె, ఒక పెద్ద చెంచా రోజ్ వాటర్, అర చెంచా గ్లిజరిన్, ఒక పెద్ద చెంచా ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె అవసరం. ముందుగా మీగడను ఒక శుభ్రమైన గిన్నెలో తీసుకుని మెత్తగా అయ్యే వరకు గిలక్కొట్టాలి. అనంతరం బాదం నూనె, ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఆ తర్వాత తేనె, గ్లిజరిన్ జోడించి, చివరగా రోజ్ వాటర్ వేసి క్రీమ్‌లా తయారయ్యే వరకు మిక్స్ చేయాలి.

తయారైన ఈ మిశ్రమాన్ని శుభ్రమైన చిన్న కంటైనర్‌లో ఉంచుకోవాలి. రాత్రి పడుకునే ముందు కొద్దిగా తీసుకుని ముఖం, మెడకు సున్నితంగా రాసుకోవచ్చు. అయితే ఇందులో తాజా పాల ఉత్పత్తులు ఉండటంతో ఎక్కువ రోజులు నిల్వ చేయకుండా చిన్న పరిమాణంలో తయారు చేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఉపయోగించే ముందు చేతి లోపలి భాగంలో కొద్దిగా రాసి పరీక్షించుకోవాలి. అలర్జీ, మంట లేదా దురద వస్తే వాడకూడదు. ఇలా తగిన జాగ్రత్తలు పాటిస్తూ చలికాలంలో చర్మ సంరక్షణపై శ్రద్ధ చూపవచ్చు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!