ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అందజేత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అక్టోబర్ 9 (Y7 న్యూస్ తెలుగు):
కరకగూడెం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు కళ్యాణలక్ష్మి చెక్కులు, రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ వట్టం కాంతయ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా మండలానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు, 5,242 కుటుంబాలకు రేషన్ స్మార్ట్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
కార్యక్రమానికి సంబంధిత అధికారులు, పాత్రికేయులు హాజరై విజయవంతం చేయాలని తహసీల్దార్ వట్టం కాంతయ్య శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు.
రిపోర్టర్: దిలీప్ కుమార్, కరకగూడెం | Y7 న్యూస్ తెలుగు
Post Views: 23









