భద్రాచలం, అక్టోబర్ 9 (Y7 న్యూస్ తెలుగు):
భద్రాచలం పట్టణంలోని విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు సుమారు గంటపాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.
220 కేవీ పాల్వంచ నుంచి వచ్చే టవర్ లైన్‌లో తలెత్తిన సమస్యను సరిచేసేందుకు ఈ అంతరాయం కలగనుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, విద్యుత్ శాఖకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Post Views: 9









