సమాచారం అందుకున్న వెంటనే పోలీసు అధికారులు సీఐ వి. కృష్ణ ఆధ్వర్యంలో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్ఐ అప్పలరాజు సిబ్బందితో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
మృతి చెందిన వారు గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన ఊకె సుశీల, ఊకె లక్ష్మి, తుర్రం భారతి, బాసిబోయిన బాలరాజు, ఊకె రమేష్గా గుర్తించారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.
మృతదేహాలను గుర్తించిన అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఒక్కసారిగా ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో గొమ్ముకొత్తగూడెం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోయాయి.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లే సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
Post Views: 1,160









