E-PAPER

Samsung Galaxy Unpacked 2026 జూలై 22న.. కొత్త ఫోల్డబుల్స్, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్‌కు రంగం సిద్ధం!

ఈ ఏడాది ప్రారంభంలో గెలాక్సీ S26 సిరీస్‌ను విడుదల చేసిన శాంసంగ్, ఇప్పుడు రెండో Galaxy Unpacked 2026 ఈవెంట్‌కు సిద్ధమైంది. జూలై 22న లండన్‌లో జరగనున్న ఈ కార్యక్రమంలో కొత్త తరం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, కంపెనీ తొలి స్మార్ట్ గ్లాసెస్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది.

ఈ ఈవెంట్ లండన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు, భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానుంది. శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు కంపెనీ యూట్యూబ్ ఛానెల్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

ఈ వేడుకలో Galaxy Z Fold 8, Galaxy Z Fold 8 Ultra, Galaxy Z Flip 8 ఫోల్డబుల్ ఫోన్లతో పాటు Galaxy Watch 9, Galaxy Watch Ultra 2, అలాగే శాంసంగ్ తొలి స్మార్ట్ గ్లాసెస్ను పరిచయం చేసే అవకాశముందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!