‘టాక్సిక్’ సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్‌పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంది. ముఖ్యంగా తాజాగా విడుదలైన ‘తబాహి’ సాంగ్‌లో యష్, కియారా అద్వానీ మధ్య రొమాంటిక్ సన్నివేశాలపై విమర్శలు వెల్లువెత్తాయి. పెళ్లి తర్వాత కియారా ఇలాంటి సన్నివేశాల్లో నటించడం ఎందుకని కొందరు నెటిజన్లు ట్రోల్ చేయగా, దర్శకురాలు గీతూ మోహన్ దాస్‌పైనా విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ ట్రోలింగ్‌పై ‘టాక్సిక్’లో నటిస్తున్న బ్రిటిష్ నటుడు బెనెడిక్ట్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. యష్ లుక్‌ను ప్రశంసిస్తూ, అదే సమయంలో కియారాను మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శించడం ద్వంద్వ వైఖరి అని ఆయన అన్నారు. పెళ్లి తర్వాత హీరోయిన్ ఇలాంటి పాత్రలు చేయకూడదని చెప్పడం సరైన ఆలోచన కాదని స్పష్టం చేశారు.
యష్‌కు కూడా పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారని, అయితే ఆయనపై అలాంటి వ్యాఖ్యలు చేయకుండా కేవలం కియారానే ట్రోల్ చేయడం అన్యాయమని బెనెడిక్ట్ పేర్కొన్నారు. నటీనటుల పని కథకు తగ్గట్టు పాత్రలను పోషించడమేనని, వ్యక్తిగత జీవితాన్ని సినిమాతో ముడిపెట్టి విమర్శించడం మానుకోవాలని ఆయన నెటిజన్లకు సూచించారు.








