E-PAPER

రాఘవ్ చడ్డా ఓటర్‌ లిస్ట్‌ నుంచి పేరు తొలగింపు.. పంజాబ్‌లో రాజకీయ దుమారం!

రాజ్యసభ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మాజీ నేత రాఘవ్ చడ్డా పేరు పంజాబ్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్‌ నుంచి తొలగించడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. పంజాబ్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో ఆయన పేరును ‘షిఫ్టెడ్’గా పేర్కొన్నట్లు రాఘవ్ చడ్డా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

తన ఓటర్ ఐడీ పంజాబ్‌లోని మొహాలీలోనే రిజిస్టర్ అయి ఉందని రాఘవ్ చడ్డా తెలిపారు. అలాంటప్పుడు తన పేరును ‘షిఫ్టెడ్’గా ఎలా పేర్కొంటారని ఆయన ప్రశ్నించారు. ఓటర్ లిస్ట్‌లో తన పేరు తొలగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

రాఘవ్ చడ్డా పేరు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్‌ నుంచి తొలగించారనే విషయం వెలుగులోకి రావడంతో పంజాబ్ రాజకీయాల్లో చర్చ మొదలైంది. SIR ప్రక్రియలో భాగంగా ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. తన ఓటు హక్కుకు సంబంధించిన అంశంపై రాఘవ్ చడ్డా ప్రశ్నలు లేవనెత్తడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!