ఉక్రెయిన్‌కు బ్రిటన్ ఆయుధాలు, సైనిక సహకారం అందిస్తున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. బ్రిటన్‌కు చెందిన రక్షణ పరిశ్రమలు లేదా సైనిక స్థావరాలపై రష్యా దాడులు చేసే అవకాశం ఉందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. పుతిన్ “అది మిలిటరీ సీక్రెట్” అంటూ సమాధానమిచ్చారు. దీంతో బ్రిటన్‌పై రష్యా వైఖరిపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఉక్రెయిన్‌లో బ్రిటన్‌కు చెందిన సైనిక సదుపాయాలు ఉంటే అవి రష్యాకు చట్టబద్ధమైన లక్ష్యాలేనని పుతిన్ స్పష్టం చేశారు. బ్రిటన్ నుంచి ఉక్రెయిన్‌కు ఆయుధాలు, సైనిక సాంకేతిక సహకారం కొనసాగుతున్న సమయంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల రష్యా అధికారులు కూడా బ్రిటన్‌కు సంబంధించిన సైనిక లక్ష్యాలపై హెచ్చరికలు చేసినట్లు సమాచారం.
దాడి చేస్తామని కానీ, చేయబోమని కానీ స్పష్టంగా చెప్పకుండా పుతిన్ “మిలిటరీ సీక్రెట్” అని వ్యాఖ్యానించడంతో రష్యా-బ్రిటన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలపై చర్చ జరుగుతోంది. బ్రిటన్ ఉక్రెయిన్‌కు అందిస్తున్న సైనిక సహకారం నేపథ్యంలో మాస్కో నుంచి వస్తున్న వరుస హెచ్చరికలు యూరప్‌లో భద్రతాపరమైన ఆందోళనలను పెంచుతున్నాయి.








