E-PAPER

అయోధ్యలో కనులపండువగా దీపోత్సవం..! అయోధ్యలో 36 లక్షలకు పైగా మట్టి ప్రమిదలతో ఘనంగా దీపోత్సవం..

అయోధ్యలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన 10వ విడత దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సరయూ నదీ తీరంలోని 56 ఘాట్లలో ఏకంగా 36 లక్షలకు పైగా మట్టి ప్రమిదలను వెలిగించి సరికొత్త రికార్డు సృష్టించారు. శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రాంగణంలోనూ మరో లక్ష దీపాలను వెలిగించారు. సుమారు 35 వేల మందికి పైగా వాలంటీర్లు ఈ ప్రమిదలను క్రమపద్ధతిలో పేర్చి వెలిగించడంలో పాలుపంచుకున్నారు.

ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్.. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లతో కలిసి రామ్ కీ పైడీ వద్ద ఈ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన నయా ఘాట్ వద్ద జరిగిన సరయూ హారతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, దీపోత్సవం భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని కొనియాడారు. అయోధ్య ప్రాచీన సంప్రదాయాలు, ఆధునిక అభివృద్ధి కలయికగా నిలుస్తోందని ప్రశంసించారు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. 2017లో 1.71 లక్షల దీపాలతో మొదలైన ఈ ఉత్సవం ఏటేటా విస్తరిస్తూ ఇంతటి ఘన స్థాయికి చేరుకుందన్నారు. గతంలో రామజన్మభూమి ఉద్యమాన్ని వ్యతిరేకించిన రాజకీయ నాయకులు రాముడి భక్తులకు, సాధువులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులతో అయోధ్యను ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.

ఈ వేడుకల్లో భాగంగా రామ్‌చరిత్‌మానస్ ఘట్టాలను ప్రతిబింబించే 21 శకటాల ప్రదర్శన, 2,100కి పైగా స్వదేశీ డ్రోన్లతో రూపొందించిన ఆకాశ విన్యాసాలు, లేజర్ షోలు, బాణసంచా వెలుగులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 14 ఏళ్ల వనవాసం ముగించుకుని శ్రీరాముడు సీతాలక్ష్మణులతో అయోధ్యకు తిరిగొచ్చిన ఘట్టాన్ని స్మరిస్తూ ఈ దీపోత్సవాన్ని నిర్వహించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!